* జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్యపై వెలుగుచూస్తున్న నిజాలు
* ప్రియుడు ప్రణయ్ తేజ్ అరెస్ట్.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియుడు ప్రణయ్ తేజ్ పెళ్లికి నిరాకరించడంతోనే లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్ధిపేటలో జూనియర్ డాక్టర్ గా ఇంటర్న్షిప్ చేస్తోంది. ఈ నేపధ్యంలో మరో జూనియర్ డాక్టర్ ప్రణయ్ తేజ్ తో లావణ్య గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన లావణ్యను బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ తేజ్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో లావణ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటర్న్షిప్, నీట్ ప్రిపరేషన్ ఒత్తిడే లావణ్య ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. లావణ్య కుటుంబసభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభంచగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య ప్రియుడు ప్రణయ్ తేజ్ ను పోలీసులు అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
………………………………………….

