* వైరల్ అవుతున్న హాస్టల్ వార్డెన్ ఆడియో
* వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విద్యార్థులను కన్న తండ్రిలా చూసుకోవాల్సిన హాస్టల్ వార్డెన్ కర్కషంగా
ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులు తనపై ఫిర్యాదు చేసినందుకు గాను ఏకంగా విద్యార్థులందరనినీ అన్నంలో
విషం కలిపి చంపేయండంటూ హాస్టల్ సిబ్బందికి ఫోన్ లో ఆదేశాలు జారీ చేశాడు. ఈ ఆడియో కాస్తా వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ తక్షణమే అతడిని సస్పెండ్ చేస్తే ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా సిగ్గాపూర్ ఎస్సీ హాష్టల్ కిషన్ నాయక్ ప్రవర్తన పై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థ/ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తప్పతాగి హాస్టల్ కు వచ్చి బెదిరిస్తున్నాడని హాస్టల్ పై నుండి కిందకి తోసేస్తామని బెదిరిస్తతున్నాడని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని చదువుకుందామంటే కరెంట్ ఉండడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా తమ పట్ల కిషన్ నాయక్ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హాస్టల్ వార్డెన్ తీరుపై విసిగెత్తిన విద్యార్థులు
గురువారం రాత్రి సిగ్గాపూర్ రహదారిపై హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మహేష్ శ్రీనివాస రావు విద్యార్థులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. విద్యార్థలు తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన వార్డెన్ విద్యార్థులు తినే ఆహారంలో విషం కలపండంటూ హాస్టల్ సిబ్బందిక్ఇ ఫోన్ లో హుకుంజారీ చేశారు. వార్డెన్ మాట్లాడిన పోన్ కాల్ ఆడియో కాస్తా వైరల్ అయింది. విషయం జిల్లా కలెక్టర్ కు తెలియడంతో జిల్లా కలెక్టర్ తక్షణమే వార్డెన్ కిషన్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………..

