
* హైడ్రా ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించిన అధికారులు
* రూ. 139 కోట్ల విలువైన భూమికి విముక్తి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడును మరింత పెంచింది. తాజాగా బుధవారం హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను తొలగించారు. బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించించారు. అక్రమణ దారులు కబ్జా చేసిన 19 వేల 878 గజాల భూమిని హైడ్రా అధికారుల కాపాడారు. ప్రజావాణికి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామాల్లో భూములు కబ్జాలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బుధవారం కబ్జాలను జేసీబీల సహాయంతో తొలగించారు. హైడ్రా ప్రజావాణికి సోమవారం మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులను తాను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ నీరు వచ్చి చేరడంతో పైన ఉన్న హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే ఔట్లు కూడా మునిగిపోతున్నాయని ఫిర్యాదులు అందినట్లు వివరించారు.
…………………………………..