* గెలవమని ముందే తెలుసు
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవదని ముందే తెలుసు అన్నారు. ఈ ఫలితాలను మందే ఊహించామని అన్నారు. ఎన్నికల బరిలో ఉండాలి కాబట్టి పోటీ చేశామని చెప్పుకొచ్చారు. కౌంటింగ్ లో మొదటి రౌండ్ లో 2,167 ఓట్లు రాగా 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి రౌండ్ రౌండ్ కూ పార్టీ పరిస్థితి వెనుకంజలో ఉంది.. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో బీఆర్ ఎస్ కొనసాగుతుండగా బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది.
…………………………………………………….
