
* అధికమొత్తంలో నిద్రమాత్రలు వాడా
* పోలీసులకు వాంజ్ఞూలం ఇచ్చిన గాయని కల్పన
ఆకేరున్యూస్, హైదరాబాద్: తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, తన కుమార్తె విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు గాయని కల్పన తెలిపారు. ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘కల్పన గత 5 సంవత్సరాల నుంచి భర్తతో కలిసి హైదరాబాద్‌లోని విల్లాలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె దయ ప్రసాద్‌కి, కల్పనకు మధ్య చదువు విషయంలో ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. అనంతరం ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. అదే సమయంలో కల్పన భర్త ప్రసాద్.. ఆమెకు పలుమార్లు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో, ప్రసాద్ కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేసి చెప్పగా, వారు ఆఎంఒ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కేపీహెచ్‌బీ పోలీసులు, కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను సవిూపంలోని ఆస్పత్రికి తరలించాం ‘ అని పోలీసులు వెల్లడిరచారు. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. తనకు, తన కుమార్తెకు జరిగిన విషయంలో నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని ఆమె వెల్లడిరచినట్టు తెలిపారు.
……………………………………….