
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తనకు రాజకీయాలతో పనిలేదని ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి (MEGA STAR CHIRANJEEVI)అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై చేసే రాజకీయ విమర్శలను లెక్కచేయనని చిరంజీవి అన్నారు.సోషల్ మీడియాలో తనపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయని వాటిని అస్సలు పట్టించుకోనని చిరంజీవి తెలిపారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY)ని కలిసిన సందర్భంగా కూడా కొంతమంది నేతలు తనపై విమర్శలు చేశారని చిరంజీవి అన్నారు. ప్రజలకు మంచి చేయడం మంచి చేసే వారిని ప్రోత్సహించడమూ తన పని అని చిరంజీవి అన్నారు.ప్రజల ప్రేమ వారి ఆదరణనే నన్ను కాపాడుతుందని చిరంజీవి తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన తృప్తి తనకు మిగిలిందని చిరంజీవి అన్నారు. అంతకంటే మించిన తృప్తి ఎక్కడ ఉంటుందని చిరంజీవి తెలిపారు.
……………………………………………..