
* నాకు కాంగ్రెస్ లోకి వెళ్లే ఉద్దేశం లేదు
* కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై నాకు కోపం లేదు
* ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవాల్సిందే
* సోషల్‌మీడియాలో నాపై దాడి
* తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (KAVITHA) స్పష్టం చేశారు. సీఎం ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, భయపెడుతున్నారేమో అని అన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. హైదరాబాద్(HYDERABAD)లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంతా ఏమీ ఆలోచించలేదన్నారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అని తెలిపారు. 2016లోనే కేటీఆర్ చెప్పానని, ఇరిగేషన్ ఫైళ్లు కింది స్థాయిలో పరిశీలన లేకుండానే నేరుగా సీఎంకు వెళ్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు లో స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే తాము జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని అన్నారు. పదేళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోయామన్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ, హరీశ్‌రావు(HARISHRAO), సంతోష్ (SANTHOSH)మీడియాలో తనపై దాడి చేస్తున్నాయని తెలిపారు.
………………………………………………………….