* నాపై ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు
* ప్రజా సంక్షేమం కోసం పని చేస్తా
* మంత్రి అజహరుద్దీన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం తాను పని చేస్తానని మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) తెలిపారు. తనకు మంత్రి పదవి కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy)కి కౌంటర్ ఇచ్చారు అజహర్. ఆయన సర్టిఫికెట్ తనకు అవసరం లేదని తెలిపారు. ఆయన ఏదైనా మాట్లాడతారని, దేశభక్తిపై తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని వెల్లడించారు. తన గురించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు, తన పదవికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు క్యాబినెట్లోకి తీసుకోవడం హైకమాండ్, సీఎం నిర్ణయమని తెలిపారు.
……………………………………………………..
