
* జగన్ను కలవాలంటే ఆ కోటరీకి లబ్ధి చేకూర్చాలి
* జగన్ మనసులో స్థానం లేదని తెలిసి మనసు విరిగింది
* మళ్లీ వైసీపీలో చేరేది లేదు : విజయసాయిరెడ్డి
ఆకేరు న్యూస్, అమరావతి : జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమయ్యానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai rEddy) అన్నారు. ఆ కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు రాజకీయ భవిష్యత్ అని జోష్యం చెప్పారు. జగన్ (Jagan)ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఆ కోటరీకి లభ్ధి చేకూర్చాలని విజయసాయి విమర్శించారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నా అని జగన్తో చెప్పినట్లు వివరించారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదన్నారు. చెప్పుడు మాటలు నమ్మితే, నాయకుడు, ప్రజలు నష్టపోతారని తెలిపారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి భాస్కరరెడ్డి(Kasireddy Bhaskarreddy)ది కీలకపాత్ర అని చెప్పారు. వైసీపీలో అనేక అవమానాలు, కష్టాలు పడ్డానని, పదవులు ఇచ్చినప్పటికీ అవమానాలు భరించలేకపోయానని వెల్లడించారు. తాను విశ్వసనీయతను కోల్పోయానని, ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని, తాను ఎవరికీ లొంగలేదని, జగన్లోనే మార్పు వచ్చిందని విమర్శించారు. తాను మళ్లీ వైసీపీ(YCP)లో చేరేది లేదని స్పష్టం చేశారు.
…………………………………………….