
* ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా వారిని ప్రాణస్నేహితుడిలా కాపాడుకుంటా
* ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తా
* హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు
* త్వరలోనే అందుబాటులోకి వాట్సప్ గవర్నెన్స్
* సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందిస్తాం
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, పల్నాడు జిల్లా : తనకు ఎవరూ హైకమాండ్ లేరని, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలే తనకు హైకమాండ్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Ap Chief Minister Chandrababunaidu)అన్నారు. ఏపీలోని ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా వారిని ప్రాణస్నేహితుడిలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా యల్లమందలో ఆయన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఏడుకొండలు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు. కుటుంబసభ్యులకు కాఫీ(Coffee) పెట్టి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక ప్రజల సేవలో చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పరదాలు కట్టేవారని, తాను సాదాసీదాగా వచ్చానని, ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తానని తెలిపారు. మీ శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా ఇక్కడకు వచ్చానన్నారు. పెన్షన్ల కోసం ఏడాదికి 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు
రాయలసీమ(Rayalaseema)లో ఫ్యాక్షన్ అణచివేశాను కానీ.. పల్నాడులో హింస కొనసాగుతోందన్నారు. తనలాంటి వాడు కూడా మాచర్ల(Macharla)కు రాలేని పరిస్థితి ఉందని, పల్పాడులో హింస పోవాలి.. అభివృద్ధి రావాలని పేర్కొన్నారు. మంచికి మంచిగా ఉంటా.. దారి తప్పినవాళ్లకు చెండశాసనుడిగా ఉంటా.. అంటూ హెచ్చరించారు. తెలుగుతల్లికి జలహారతి పేరుతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఆలోచన చేస్తున్నానన్నారు. ఐదేళ్లు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అనాథగా చేశారని వెల్లడించారు. చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఒకటో తారీఖునే జీతాలు చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు.
తొందరలోనే మెగా డీఎస్సీ
త్వరలోనే మెగా డీఎస్సీ (Mega Dsc)పెట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాబోయే సంవత్సరం స్కూళ్లు తెరిచేలోగా 16వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వనాదన్నారు. త్వరలోనే అందుబాటులోకి వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తామన్నారు. సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందిస్తామని, ఆఫీసులకు వెళ్లకుండానే సర్టిఫికెట్లు పొందొచ్చు అని తెలిపారు.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట
గత ముఖ్యమంత్రి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట అడారని, ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని బాబు వెల్లడించారు. అమరావతి(Amaravathi) నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్నవి పోయాయన్నారు. కేంద్రం నిధులను కూడా మళ్లించి దోచుకున్నారని ఆరోపించారు. మాపై నమ్మకంతో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
……………………………………..