
* వికారాబాద్ నాయీ బ్రాహ్మణుల నిర్ణయం
* నాయీ బ్రాహ్మణ వృత్తిని ఇతరులు చేయరాదని డిమాండ్
* హైకోర్టు వ్యాఖ్యలపై ఆందోళన
ఆకేరు న్యూస్ డెస్క్ ః వికారాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణులు నెల రోజుల పాటు తమ సేవలను నిలిపివేశారు. ఇటీవల హైకోర్టు నాయీ బ్రాహ్మణ వృత్తిని తమకు నచ్చిన వారు ఎవరైనా చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించిన నేపధ్యంలో నాయీ బ్రాహ్మణులు వికారాబాద్ లో నెలరోజుల పాటు తమ వృత్తులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి పట్టణంలో సెలూన్ ఓపెన్ చేశారు. నాయీ బ్రాహ్మణ సమాజానికి చెందిన వాడను కానందున ఓ వర్గం వారు వచ్చి తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టునను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో హైకోర్టు జీవనోపాధి పొందడానికి ఏ పని అయినా చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు వ్యాఖ్యలతో తాము జీవనోపాధి కోల్పోతామని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేపధ్యంలో నెల రోజుల పాటు సిల్లాలో విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.నెల రోజుల పాటు పురుడు పోసేది లేదన్నారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయొద్దని తీర్మానించుకున్నారు. వృత్తిపరమైన ఎలాంటి కార్యక్రమాల్లో నెల రోజుల పాటు పాల్గొనబోమని తీర్మానించుకున్నారు.
………………………………………………