
* భారత్ వంటకాలంటే ఎంతో ఇష్టం..
* వీసాల జారీ లో ఆలస్యాన్ని నివారిస్తా..
* హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్న లారా విలియమ్స్
ఆకేరు న్యూస్హైదరాబాద్ : భారత్-అమెరికా దౌత్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.హైదరాబాద్‌లో కాన్సుల్ జనరల్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్( LARA WILLIAMS) గౌరవార్థం అమెరికాలో భారత సంతతి ప్రముఖులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.భారత్ వంటకాలు అంటే తనకు బాగా ఇష్టం అని తెలిపారు. గతంలో భారత్‌లో పర్యటించినప్పుడు వంటకాలను బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. ఏఐ, (AI) క్వాంటమ్ కంప్యూటింగ్, (QUANTUM COMPUTING) బయోటెక్నాలజీ (BIO TECHNOLAGY)వంటి సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యంతో అవకాశాలు పెరుగుతాయని లారా విలియమ్స్ తెలిపారు. భారత్, అమెరికాల మధ్య దౌత్య బంధం బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా లారా విలియమ్స్ హామీ ఇచ్చారు. యూఎస్ అమెరికా సాలిడారిటీ మిషన్ చైర్మన్,(AMIRICAN SOLIDORITY MISSION) ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) సహ వ్యవస్థాపకుడు రవి పులి సారథ్యంలో వర్జీనియాలోని టైసన్స్ కార్నర్లో (INDIAN TISENCE CORNER)ఈ కార్యక్రమం జరిగింది. భారత సంతతి వ్యాపారవేత్తలు, టెక్నాలజీస్టులు, పాలసీ లీడర్స్, వివిధ మేధో, వాణిజ్య సంఘాలు ప్రతినిధులు ఈవిందుకు హాజరయ్యారు.లారా విలియమ్స్ మాట్లాడుతూ ప్రభుత్వం, వ్యాపారవర్గాలు, ఎండ్ యూజర్ల మధ్య పరస్పర విశ్వాసమే సైబర్ సెక్యూరిటీకి మూలమని వ్యాఖ్యానించారు. వీసాల జారీలో జాప్యంపై కూడా మిస్ లారా స్పందించారు. హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయంలో 54 వీసా విండోస్ అందుబాటులో ఉన్నా తగినంత సిబ్బంది లేరని అన్నారు. సిబ్బంది సంఖ్య పెంపుతో పాటు ఏఐ, ఆటోమేషన్ సహకారంతో కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
మూడు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ
భారతదేశంలో తెలంగాణ(TELANGANA)ఆంధ్రప్రదేశ్,(ANDHRA PRADESH) ఒడిశా (ODISHA) రాష్ట్రాలలో అమెరికా వ్యాపారాల విస్తరణకు తాను కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవిపై కూడా ప్రశంసలు కురిపించారు. ఆయన ఆతిథ్యం లభించడం గౌరవప్రదంగా భావిస్తున్నానని అన్నారు. మూడు రాష్ట్రాల వంటకాల రుచులను ఆస్వాదించానని కూడా అన్నారు. భారత్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. 13 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడు హిందీ నేర్చుకునేందుకు ప్రయత్నించానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మరోసారి భర్త, తనయుడితో కలిసి భారత్‌కు వెళ్లే అవకాశం లభించడంతో తన కల సాకారమైందని అన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రవి పులి (RAVI PULI)మాట్లాడుతూ విలియమ్స్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
మాతృదేశ రుణం తీర్చుకుంటాం..
భారత్‌లో విద్యనభ్యసించి అమెరికాలో ఉన్నతంగా ఎదిగిన తాము మాతృదేశ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ దిశగా లారా విలియమ్స్ తన వంతు సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడం స్ఫూర్తివంతమని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఐబీసీ, భారత ఎంబసీ, ప్రాతీయ మేధో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాల్లో వ్యాపారాలున్న , ఎన్ ఆర్ లు కూడా పాల్గొన్నారు.
————–