
* అయినా నన్ను పక్కన పెడుతున్నారు
* ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతపార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, తనతోపాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తనను మాత్రం పక్కన పెట్టారని మండిపడ్డారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనల పేరుతో జారీ చేసిన అంశాలపై సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ కేవలం ప్రజలకు మేలు చేసేందుకే అన్నారు. నియోజకవర్గంలోని మండలాలలో వైన్ షాప్స్ టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు. వైన్ షాప్లు ఊరి బయట మాత్రమే పెట్టాలని,వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నారు.ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
…………………………………..