
* హీరో సాయి ధరమ్ తేజ్
*ఆటో ఎక్స్పో 2025లో పాల్గొన్న ధరమ్ తేజ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వల్లే తాను బతికానని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన ఆటో ఎక్స్పె 2025 లో హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం చాలా విలువైనదని ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని సూచించారు. హెల్మట్ ధరించడం వల్లే తాను పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డానని అన్నారు. ఆ సంఘటననే ఉదాహరణగా తీసుకొని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా నుడుచుకోవాలని సూచించారు. 2021లో, హైదరాబాద్లో స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్నప్పుడు సాయి ధరమ్ తేజ్ అదుపు తప్పి కిందపడిపోయిన విషయం తెల్సిందే ఆ ప్రమాద తీవ్రతకు ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి, రోజుల తరబడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడారు. కాలర్ బోన్ విరగడంతో పాటు, ఛాతీ, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వైద్యులు ముక్తకంఠంతో చెప్పిన ఒకే ఒక్క మాట, “ఆయన తలకు హెల్మెట్ ఉండటం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ మాట్లాడుతున్నంత సేపు సభికుల వద్ద నుంచి మంచిస్పందన లభించింది.
……………………………………..