
* మళ్లీ 20 ఏళ్ల వరకు కాంగ్రెస్కు ప్రజలు ఓటేయ్యరు
* బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా అని ప్రతిపక్ష పార్టీ, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అనడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్కు ఓటేయ్యరని అన్నారు. ప్రజలకు కూడా అన్ని విషయాలూ అర్థం కావాలన్నారు. సీఎం ఆర్థిక దోపిడీ, విధ్వంసంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ సాగాలన్నారు. కేంద్ర సాధికార కమిటీ సిఫార్సుల మేరకు విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని, కమిటీకి చిత్తశుద్ధి ఉంటే కమిటీ సిఫార్సు మేరకు విచారణ చేయాలన్నారు. బీఆర్ ఎస్ (BRS)తరఫున ఇప్పటికే అన్ని శాఖలకూ లేఖ రాశామన్నారు. బీకాన్ సంస్థకు ఆర్థిక లబ్ధి చేకూర్చడంపై విచారణ జరగాలన్నారు. రెండు ఢిల్లీ పార్టీలు ఈడీని తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు. సీఎం(CM) స్థానంలో మరొకరు ఉంటే.. సుప్రీంకోర్టు (SUPREME COURT) వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారని తెలిపారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్లాలని సూచించారు.
……………………………………….