
* మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: మీ వారసత్వానికి అర్హులుగా ఉంటానికి ప్రతీ క్షణం కృషిచేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పుట్టి రోజు సందర్భంగా ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి తండ్రీ తమ పిల్లలకే హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యమని కేటీఆర్ తెలిపారు.
……………………………………………..