
కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
* కాళేశ్వరం సృష్టి కర్త కేసీఆరే
* రిపోర్ట్ త్వరగా బయట పెట్టాలి
* నిజమైన దోషులెవరో త్వరగా తేల్చండి
* కమిషన్ విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల
ఆకేరు న్యూస్ హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును త్వరగా బయట పెట్టాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.. కాళేశ్వరం కమిషన్‌పై ఏర్పాటు చేసిన కమిషన్ ముందు ఈటెల హాజరయ్యారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపధ్యంలో కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా ఎంపీ ఈటెలకు విచారణ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.. ఈ నేపధ్యంలో విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఈటెల కమిషన్ ముందు హాజరై విచారణలో పాల్గొన్నారు..విచారణ అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ..తన గుండెలపై తుపాకీ ఎక్కు పెట్టినా తాను నిజమే మాట్లాడుతానని స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా అని కమిషన్ అడిగిందని.. తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అని అడగ్గా.. తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని.. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని కమిషన్ ప్రశ్నిస్తే.. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను త్వరగా బయటపెట్టాలని.. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
……………………………………………