
* మహ్మద్ అజహరుద్దీన్
ఆకేరు న్యూస్ హనుమకొండ: సమగ్రతకు కట్టుబడి అంకితభావంతో పనిచేస్తానని మాజీ క్రికెటర్,కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మహ్మద్ అజహరుద్దీన్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో మహ్మద్ అజహరుద్దీన్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఎంతో వినయంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చన ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేకు, సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ,కేసీ వేణుగోపాల్,సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు అజహరుద్దీన్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
………………………………..