
* ఈడీకి మహేశ్ బాబు లేఖ
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈడీ అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేశ్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరుకాలేకపోతున్నాని.. తనకు మరో డేట్ ఇవ్వాలని కోరారు. కాగా, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మహేశ్ బాబు రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని, ఆ ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రకారం ఈ సోమవారం ఉదయం 10:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి మహేశ్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. షూటింగ్ నేపథ్యంలో విదేశాల్లో ఉండటం మూలంగా హాజరుకాలేకపోతున్నానని అధికారులకు లేఖ రాసారు.
……………………………..