
బీజేపీ ఎంపీ బండి సంజయ్
* రాజకీయ సన్యాసం..
* బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మంగళవారం బండి సంజయ్ పర్యటించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఓటు చోరీ జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని అన్నారు. ఓటు చోరీ చేసినట్లయితే తెలంగాణలోనూ మేమే అధికారంలోకి రావాలి కదా అని అన్నారు. వార్డు మెంబర్‌గా గెలవని మహేశ్‌కుమార్‌గౌడ్ దొంగ ఓట్లు అంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను అవమానించారని అదేవిధంగా 8 నియోజకవర్గ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని చాలెంజ్ చేశారు. కరీంగనర్‌లో ప్రతి ఓటును పరిశీలించి దొంగ ఓట్లను తీసివేయాలని అన్నారు. కరీంనగర్‌లోని ఒక్కో మైనారిటీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. మాది దేవుళ్ల పార్టీ, మీది బిచ్చపు బతుకు అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మం కోసం బీజేపీ పోరాటం చేస్తోందని, ఎన్నికలు ఉన్నా, లేకపోయినా హిందూ ధర్మం కోసం నిలబడతామని అన్నారు. యూపీఏ హయాంలోనే దేశంలోకి రోహింగ్యాలు వచ్చారని, టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది కాంగ్రెస్ నాయకులు కాదా అని మండిపడ్డారు. ప్రజలను కలవకుండా రాత్రి పూట యాత్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. అప్పుడు బీఆర్ ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అదే తరహా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
……………………………………………………