
* దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దుబ్బాక బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి( KOTHA PRABHAKAR REDDY) పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (T, JAGGA REDDY)ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తన క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసని జగ్గారెడ్డి అన్నారు. తన క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా అమ్మనాన్న నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. తన చుట్టూ ఎప్పుడు పేద ప్రజలు ఉంటారని రోగులు కూడా తన వద్దకు వచ్చి బాధలు చెప్పుకుంటారని జగ్గారెడ్డి అన్నారు. తన గురించి కేసీఆర్ కు హరీష్ రావులకు బాగా తెలుసని వారిని అడిగి తెలుసుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డికి జగ్గారెడ్డి సూచించారు.
అలీబాబా నలభై దొంగలు
కేసీఆర్ కుటుంబానికి అలీబాబా నలభై దొంగలు టైటిల్ సరిపోతుందని జగ్గారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దొరికితే అంత దోచుకున్నారని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే అంచనా వేయలేనంతగా రాష్ట్రాన్ని దోచి పడేశారని తెలిపారు. అవినీతి యూనివర్సిటీకి కేసీఆర్ ప్రొఫెసర్ అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకి ఏమైనా చేద్దామంటే ఖజానాలో మిగుల్చకుండా దోచుకొని పోయారంటూ కేసీఆర్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
………………………………….