* నర్సంపేటలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనర్సింహ
* త్వరలో నర్సంపేటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుంది
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ రాతలు మారాతాయని తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు పట్టం కడితే కమీషన్లు తప్ప అభివృద్ధి లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని.. ఆ దిశగా అభివృద్ధి ఆరు నెలల కాలంలో చూపించామన్నారు. నర్సంపేటకు నర్సింగ్ కళాశాల కూడా రాబోతోందని, అన్ని రకాల ట్రీట్మెంట్ జరిగే విధంగా వరంగల్లోనే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే 9నెలల్లో వరంగల్ హెల్త్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నర్సంపేటలో మెడికల్ 160 సీట్లతో ఏర్పడి నేడు 500 సీట్లతో కళాశాల ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందుందన్నారు. ప్రభుత్వం 119 నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించాలని నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే నర్సంపేటకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుందని తెలిపారు.
……………………………