
* సిగాచీ యాజమాన్యంతో రేవంత్ కుమ్మక్కయ్యారు
* బాధితులతో పాటు అడిషనల్ కలెక్టర్ ను కలిసిన హరీష్ రావు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని, అందుకే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. సోమవారం ఆయన సిగాచీ బాధితులతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ ను కలిశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన అడిషనల్ కలెక్టర్ ను కోరారు. అంతకు మందు సిగాచీ బాధితులు నిర్వహించిన ర్యాలీలో హరీష్ రావు పాల్గొన్నారు. ర్యాలీ ద్వారానే బాధితులు కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సంఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. సీఎం ప్రకటించిన కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇంత వరకు చెల్లించలేదని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని హరీష్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు అంత దూరం నుంచి ఎలా వస్తారు ఎన్నిసార్లు వస్తారు అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు చెల్లించి వారికి ప్రతీ నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 8 మంది శవాలను మిస్సింగ్ అంటూ వేధిస్తున్నారని హరీష్ అన్నారు. సీఎం సర్కార్ బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని హరీష్ అన్నారు.
………………………………………