* ఆపదలో అండగా ఉండే నాయకుడు శ్రీనివాస్ యాదవ్
* జూబ్లీహిల్స్లో బీఆర్ ఎస్ గెలవాలి
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ప్రజలకు కష్టాలు తొలగి మంచి రోజులు రావాలంటే మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి సికింద్రాబాద్ హమాలీ బస్తీలో నిర్వహించిన బొడ్రాయి పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే స్పందించి అండగా ఉంటాడని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజల కష్టాలు పోవాలంటే మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే హైదరాబాద్ ప్రజల బతుకులు బాగు పడతాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కేటీఆర్ అన్నారు. బీఆర్ ఎస్ విజయం జూబ్లీహిల్స్ తోనే మొదలు కావాలని పిలుపునిచ్చారు. కాగా జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా
లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నారు.
……………………………………………………..
