* అవినీతి కేసులో అరెస్టయిన ఈ డీ అధికారి
* 20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వైనం
* 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
* ఒడిషాలో ఘటన
ఆకేరున్యూస్,హైదరాబాద్: కంచే చేనును మేస్తే ఎలా ఉంటుంది.. రక్షకుడే భక్షకుడు అయితే ఎలా ఉంటుంది.. అవినీతిని నియంత్రించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడితే సమాజం ఎలా ఉంటుంది. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసిన సంస్థలకు ఇక విశ్వసనీయత ఎలా ఉంటుంది.. సామాన్యుల పరిస్థితి ఏంటీ.. వారు ఎవర్ని నమ్మాలి.. ఎవర్ని నమ్మ కూడదు అన్న మీమాంసలో ఉంటారు. ఒడిషాలో ఎన్ పోర్స్ మెంట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న చింతన్ రఘు వంశీని లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారుల అదుపులోకి తీసుకున్నారన్న వార్త విస్మయానికి గురిచేసింది.. ఓ మైనింగ్ కేసులో భువనేశ్వర్ కు చెందిన వ్యాపారవేత్త నుండి చింతన్ రఘు వంశీ ఐదు కోట్ల లంచం డిమాండ్ చేశారట.. అందులో భాగంగా 20 లక్షల నగదు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. ఇదిలా ఉండగా రంఘు వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై జూన్ 4న విచారణ జరుగనుందట….
……………………………………….
