
అన్నమయ్య జిల్లాలోని మైసూర వారి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న ఏపీ డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్ డెస్క: గెలిస్తే ఫరవాలేదు. ఓడిపోతే ఓటు చోరీ జరిగినట్లా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (DEPUTY CM PAVAN KALYAN) అన్నారు. కాకినాడ(KAKINADA) లో జరిగిన 79 వ స్వాతంత్య్రదిన వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది నాయకులు ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారని గెలిస్తే ఒక లెక్క ఏడిపోతే ఒక లెక్కనా అని పవన్ ప్రశ్నించారు.పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ (YS JAGAN) చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.
ప్రజా తీర్పును గౌరవించాం
2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలిచినప్పుడు తమ పార్టీలు ఎక్కడా కూడా ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. ప్రజల తీర్పును గౌరవించి, ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డామని చెప్పారు. కానీ ఇప్పుడు, కూటమి 164 సీట్లతో గెలిచినప్పుడు, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఆరోపణలు చేయడం అన్యాయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రజల తీర్పునకు విలువ ఇవ్వాలి
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని పవన్ కళ్యాణ్ బలంగా నొక్కి చెప్పారు. ఓటమిని స్వీకరించే మనస్తత్వం నాయకులకు ఉండాలని సూచించారు. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలు కేవలం ఓటమిని అంగీకరించలేని నాయకుల నిస్సహాయతను చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు.
…………………………………………….