
* కాంగ్రెస్ ముసుగు వేసుకున్న బీజేపీ వ్యక్తి రేవంత్
* అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
* రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తెలిపారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం అంతా మోదీ ప్రసన్నం కోసమేనని విమర్శించారు. కాంగ్రెస్ ముసుగు వేసుకున్న బీజేపీ వ్యక్తి రేవంత్(Revanth) అని నిన్న నిరూపితమైందని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి మీ పని తనానికి నిదర్శనమన్నారు. కేటీఆర్(Ktr) కుమారుడి గురించి మాట్లాడింది రేవంత్ కాదా అని ప్రశ్నించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ నంబర్ వన్ గా నిలిచారని వివరించారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ (Kcr) ను మార్చురీకి పంపాలని రేవంత్ రెడ్డి అనడం సరికాదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్ గౌరవించారని గుర్తు చేశారు. కేసీఆర్ పై చేసిన మార్చురీ వ్యాఖ్యలను నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మార్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చావును కోరుకునేలా ఆయన మాట్లాడారని తెలిపారు. కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా కట్టాలని కాంగ్రెస్ నేతలు అన్నారని, అధికారంలోకి వచ్చాక ఎల్ ఆర్ ఎస్‌కు డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ(Runamaafi)పై కూడా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
……………………………..