* పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ చేసిన అభివృద్ధి శూన్యం
* జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదేళ్ల బీఆర్ ఎస్ పరిపాలనలో జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఆదివారం ఆయన యూసుఫ్ గూడలోని శ్రీ సాయిరాం గార్డెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికుడైన నవీన్ యాదవ్ ను గెలిపిస్తే మీకు అండగా ఉంటాడని తెలిపారు. గత పదేళ్ల కాలంలో జూబ్లీహిల్స్ మురికికూపంగా మారిందన్నారు,వర్షం పడితే కాలనీలకు కాలనీలు మోకాళ్ల లోతు నీరు చేరుతుందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోలేదని అన్నారు. జూబ్లీహిల్స్ కు మహర్దశ రావాలంటే మీ అందరి వాడైన నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. నవీన్ యాదవ్ గెలుపుతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక కల్లు కంపౌండ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులపై స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కల్లు కంపౌండ్ వద్ద ఉన్న ఇబ్బందులను తొలగిస్తానని మంత్రి ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు.
…………………………………………………..
