ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, ఉప్పల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ…మండలంలో 9 ఐకెపి సెంటర్లను, 13 పీఏసీఎస్ సెంటర్లను సోమవారం లోపు ప్రారంభించినున్నట్టు తెలిపారు.సోమవారం నుండి పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని,దానికి అనుకూలంగా మిల్లర్లతో కూడా మాట్లాడామని,రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలందరికీ బోనస్ వస్తుందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య గౌడ్, డైరెక్టర్లు సముద్రాల కృష్ణ ,గట్టు శ్రీధర్, జనగాని శివకృష్ణ, ఓరుసు తిరుపతి, ఆకినపల్లి బిక్షపతి, చకిలం దయాకర్, మిల్కూరి శ్రీనివాస్, నిగ్గుల లింగయ్య, యాకూబ్ పాషా, కిన్నెర కృష్ణమూర్తి కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్, పుల్లూరు శ్రీనివాసరావు, బొల్లం రాజిరెడ్డి, తడక శ్రీకాంత్, డాక్టర్ మౌటం కుమారస్వామి, మాట్ల రమేష్ ,పోడేటి బిక్షపతి, చెరిపల్లి రామచంద్రం పుల్ల శోభన్, దూడ శ్రీకాంత్, పోరండ్ల రమేష్ పల్లె సమ్మిరెడ్డి అనిల్ మారేపల్లి మహేష్ ,పాక చంద్రమౌళి, మొండెద్దుల నాగరాజు, శనిగరపు రమేష్ ,మాట్ల రాజేష్ మార్కెట్ కార్యదర్శి జన్ను యాకయ్య మార్కెట్ మరియు ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
