
* ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు
* 14 వరకు వర్షాలు కురిసే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నేటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ (HYDERABAD)లో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవశాకం ఉందని వెల్లడించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, రేపు కుమురం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు (YELLOW ALLERT) జారీ చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. హైదరాబాద్ లో 12, 13 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
…………………………………….