* పలు సంస్థలతో ఎంఓయూలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
* రాష్ట్రానికి పెట్టుబడుల వరద
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) లో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెట్టుబడ్డులను సమీకరిస్తోంది. నిన్న మూడు కంపెనీల ద్వారా రూ. 56,300 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న సర్కారు.. ఈరోజు మరిన్ని పెట్టుబడులను సమీకరించింది. ఒక్క అమెజాన్(Amazon)తోనే రూ. 60 వేల కోట్లకుపైగా ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tilmon Global Holdings), ఇన్ఫోసిస్(Infosis), విప్రో(Wipro) వంటి ఐటీ దిగ్గజాలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ. 15 వేల కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంది. అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌తో భారీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ నగరంలో ఇన్ఫోసిస్ తన క్యాంపస్‌ను విస్తరించనుంది. పోచారంలో ఉన్నటువంటి క్యాంపస్‌లో అదనంగా ఇప్పుడు 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా.. అక్కడ సదుపాయాల్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో డీల్ చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంగ్రాజ్కాతో.. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ (Minister Sridhar)బాబు సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు.
………………………………………