
* 92కు చేరిన రోగుల సంఖ్య
* ఆర్ ఎంఓపై చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. 92 మంది రోగులు అస్వస్థతకు గురికావడంపై లోతుగా విచారణ వేగవంతం చేశారు. 18 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరో 74 మందికి ఎర్రగడ్డ (Erragadda) వైద్యశాలలోనే గాంధీ, ఉస్మానియా వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎప్పుడు ఇచ్చే ఆహారంతో పాటు ప్రత్యేకంగా పాయసం అందించినట్లు పేర్కొన్నారు. మానసిక రోగుల అస్వస్థతకు ఆహారమే (Food Poision) కారణం కావొచ్చని ప్రాథమికంగా నిర్ధరించినట్లు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పాటు డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పద్మజపై చర్యలు తీసుకున్నారు. ఆమెను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పద్మజ స్థానంలో ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శంకర్‌కి ఇంచార్జ్ సివిల్ సర్జన్‌గా బాధ్యతలు అప్పగించారు.
……………………………………………………..