* ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పార్లమెంటు సమావేశాల్లో ఇన్ సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులను టెట్ మినహాయించాలని తీర్మానం చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీం కోర్టు ద్వారా సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ పాస్ ఐ ఉండాలనే నిబంధనను సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని , రాష్ట్ర ప్రభుత్వం , సంఘాల తరుపున సుప్రీంకోర్టులో అపీల్ చేయడం జరిగింది అన్నారు. టెట్ పాస్ కాకపోతే ఉద్యోగమే పోయెటట్లు ఉందని ఇటీవల కొందరు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎవరు అట్లాంటి అఘాయిత్యాలకు, దారుణాలకు చోటు ఇవ్వదని ధైర్యంగా ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులిపుడు పుస్తకాలతో కుస్తీలు పట్టడం కష్టం అవుతుందన్నారు, టెట్ ఎపుడైతే అమలైందో దానికంటే ముందు సర్వీస్ లో వచ్చిన వారందరికీ మినహాయించాలని అన్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు టెట్ అనే అంశంపై గందరగోళం పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నా నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.
……………………………………………………….
