* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఆకేరు న్యూస్, నర్సంపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణం లోని మహాత్మా జ్యోతిబాయ్ పూలే గురుకుల విద్యాలయాన్ని ఎమ్మెల్యే దొంతి శనివారం పరిశీలించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. త్వరలో గురుకులాలకు అద్దె భవనాల సమస్యను నిర్మూలిస్తామని,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు.విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చ గోస్ట్ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం మిస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు 40 శాతం పెంచి ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చార్జీలనే నిన్నటి వరకు సాగించారని,బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థినీ విద్యార్థులకు పుష్టికరమైన భోజనం అందించే పరిస్థితి లేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల విద్య పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సేవలందిస్తున్నామన్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న, గురుకులాలను శాశ్వత ప్రభుత్వ భవనాలు నిర్మించి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు నిర్వహించిన సాంప్రదాయ నృత్యాలు తిలకించి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంగ,స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, శీలం రాంబాబు,పి ఎస్ ఎస్ సి చైర్మన్ బొబ్బల రమణారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.
…………………………………..