* వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆధునికీకరించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే టర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6న ఢల్లీి నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గనుంది. రైళ్లను ఇక చర్లపల్లి వరకు కొనసాగిస్తారు. గత ఏడాది డిసెంబరు 28న ఈ టెర్మినల్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదాపడిరది. చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కశ్మీర్లో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొంటారు.
…………………………………………..