ఆకేరు న్యూస్, డెస్క్ : నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీ(Nagar Karnool Medical College)లో కలకలం రేపిన ర్యాగింగ్ ఘటనపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగుచూడడం కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులను వేధించిన నలుగురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు ప్రకటించింది. హాస్టల్ వసతిపై ఏడాది నిషేధం విధిస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6న ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన నలుగురు సీనియర్లు జూనియర్ విద్యార్థినులను తరగతులకు వెళ్లే ముందు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. గోడకుర్చీ వేయించి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే ప్రిన్సిపాల్ రమాదేవి(Principal Ramadevi) ని సంప్రదించారు. వారి ఫిర్యాదుతో ఈ విషయం యాజమాన్య దృష్టికి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రిన్సిపాల్ చర్య తీసుకుంటూ సంబంధిత విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు.
…………………………………….
