* ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఘనపురం మండలం చెల్పూరు కేటిపిపిలోని డి.ఏ.వి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంబించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులును పరిశీలించి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు.ఇలాంటి సైన్స్ ఫెయిర్లు శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకు చేరవేసే ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కేటిపిపి సి.ఈ శ్రీప్రకాశ్, పాఠశాల ప్రిన్సిపల్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………….