ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: లోక్‌సభ ఇవాళ నిరవధిక వాయిదా పడిరది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి నేతలు తప్పుపడుతూ.. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన షా రాజీనామా చేయాలని ఇవాళ విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి లోక్‌సభ రిఫర్ చేసింది. మరో వైపు విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ బిర్లా.. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కోరారు. పార్లమెంట్ గేటు వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టొద్దని స్పీకర్ బిర్లా ఆదేశించారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు.
…………………………………