ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. కాగా, అంబేద్కర్‌తో లింకు ఉన్న బ్లూ రంగు దుస్తుల్లో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించినట్లు ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. అంబేద్కర్ ఫోటోలతో ఎంపీలు.. అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ ప్రధాన ఎంట్రీ గేటు వరకు ర్యాలీ తీశారు.
………………………..