
* 2050 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు
* అంతరిక్ష పరిశోధనలపై గ్లోబల్ కార్ఫరెన్స్ పై మోదీ సందేశం
ఆకేరు న్యూస్, డెస్క్ : చంద్రుడిపై నీటి జాడ ఉందని తొలిసారి చంద్రయాన్ ద్వారా గుర్తించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతరిక్ష పరిశోధనలపై గ్లోబల్ కార్ఫరెన్స్ పై మోదీ సందేశం ఇచ్చారు. స్పేస్ అంటే భారత్ కు ఒక అన్వేషణ, సాధికారిత అని, ఈ అన్వేషణ రాబోయే తరాలకు ప్రేరణ అన్నారు. అంతరిక్ష రంగంలోనూ మహిళలు ఎంతో ముందున్నారన్నారు. దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించామని వివరించారు. త్వరలో భారత వ్యోమగామి రోదసీలో పర్యటిస్తారని వెల్లడించారు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడని స్పష్టం చేశారు. భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని వివరించారు. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు. వసుదైక కుటుంబాన్ని భారత్ నమ్ముతుందన్నారు.
……………………………………………