
*మార్కో రూబియో ఫోన్ అనంతరం జైశంకర్ ఆసక్తికర ట్వీట్
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తోంది. పొరుగు దేశాలు, పెద్దన్న అమెరికా ఈ విషయంపై స్పందిస్తున్నాయి. తాజాగా భారత విదేశాంగ మంత్రితో అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు. పాక్తో యుద్ధపరిణామాలపై చర్చించారు. భారత్ -పాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. 2 దేశాలు నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా.. అమెరికా ఇరు దేశాలకూ మద్దతిస్తుందని చెప్పారు. మార్కో రుబియో మాట్లాడిన కొద్ది సేపటికే సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా జై శంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్ వైఖరి ఎప్పుడూ శాంతియుతంగా, బాధ్యతతో ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ తాము అలానే వ్యవహరిస్తున్నామని అన్నారు. జై శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గామారింది.
………………………………………..