* మంత్రి అజారుద్దీన్ ఆకాంక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత మహిళా జట్టు ప్రపంచ కప్ సాధిస్తుందని మణికట్టు మాంత్రికుడు, భారత మాజీ క్రికెట్ కెప్టెన్, మంత్రి అజహరుద్దీన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. సెమీస్ లో ఆస్ట్రేలియా పై అద్భుతంగా ఆడారని అదే ఊపుతో ఫైనల్లో కూడా సఫారీలపై విజయం సాధిస్తారని అజహర్ ధీమా వ్యక్తం చేశారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నేడు భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతోంది. సౌత్ ఆఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
…………………………………………………
