ఆకేరు న్యూస్, డెస్క్ : ఇండిగో సంస్థ విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు పలు సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. స్పైస్ జెట్ వంద అదనపు విమానాలను నడుపుతోంది. రైల్వే, ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ముంబయి, ఢిల్లీ, పుణె, హావ్ డా, హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వంద కంటే ఎక్కువ ట్రిప్పులలో 89 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వివిధ రైల్వే జోన్ల మీదుగా 3 రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 37 రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ నుంచి ముఖ్యపట్టణాలు, నగరాలకు బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కొందర ప్రయాణికులు ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటున్నారు. మరికొందరు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
………………………………………
