
* ఈటెలను టార్గెట్ చేస్తున్న బండి సంజయ్
* పార్టీ స్టాండ్ పైనే మాట్లాడాలి అని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః పార్టీ ప్రయోజనాల కంటే సొంతం వైపే రాజకీయ పార్టీల నేతలు మొగ్గు జూపుతున్నారు.. వ్యక్తిగత విమర్శలు..సొంత పార్టీ వాళ్లనే విమర్శించడం కాంగ్రెస్ పార్టీ లో కొత్తమీ కాదు. అందుకు ఉదాహరణ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో వరంగల్ లో కొండా మురళి సొంత పార్టీ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై కొండా మురళీ వ్యాఖ్యల తడి ఆరక ముందే మ ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే తంతు మొదలైంది.. బీజేపీ దీర్ఘకాలం అధికారంలో లేక పోవడం వల్ల అది పైకి క్రమశిక్షణ కలిగిన పార్టీగా కన్పించేది. ఇప్పుడు అసలు రంగు బహిర్గతమవుతోంది . దాదాపు దశాబ్దకాలంగా దేశంలో బీజేపీ హవా నడుస్తోంది.. ఇంకే ముంది నేతల మధ్య అభిప్రాయ భేదాలు కుమ్ములాటలు బయట పడుతున్నాయి. తెలంగాణలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పార్టీ కాస్త పుంజుకున్న మాట వాస్తవమే. కానీ ఉన్నట్టుండి పార్టీ అధిష్టానం ఎన్నికల ముందే బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇచ్చింది. కాగా బీఆర్ ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటెల రాజేందర్ ఉన్నట్లుండి బీజేపీలోకి రావడంతో బండి సంజయ్ లాంటి వాళ్లు కాస్త కినుక వహించినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో పెత్తనం చలాయించాలనన్న బండి సంజయ్ కి ఈటెల ఎక్కడ చెక్ పెడతాడో అనే అనుమానం ఉంది.. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక శాంతంగా ఉన్నాడని భావించారు. ఈటెల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు..ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అటు రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఈటెలకు మద్దతు ఉంది.. ఈ నేపధ్యంలో ఈటెలకు
పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం జరిగింది.. ఇంకా జరుగుతోంది..ఈ క్రమంలో బండి సంజయ్ అప్పుడప్పుడు కాస్త అసహనం ప్రకటిస్తున్నట్టు ఈటల వర్గీయులు భావిస్తున్నారు.. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు.పార్టీ అధ్యక్షుడు అయితేనో కేంద్ర మంత్రిగా ఉంటేనో స్టాండ్ మారదని ఆయన కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉంటే.. బీజేపీ స్టాండే మాట్లాడాలి కానీ వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరంపై ఈటల ఏమన్నారంటే..?
ఇటీవల ఈటల రాజేందర్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సంబంధించిన అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన ఈటల.. అలాగే ఈ విషయంపై కమిషన్కు వివరణ ఇచ్చారని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కమిషన్ ఎదుట హాజరైన తరువాత ఈటెల ఓ ప్రైవేట్ చానల్ లో మాట్లాడిన తీరు బీ ఆర్ ఎస్ కు అనుకూలంగా ఉందని ఈటెల బీజేపీలో ఉంటూ అలా ఎలా మాట్లాడుతారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు..బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండ్ తోనే మాట్లాడాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో పక్క కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ కు మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. వందేళ్ల పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు సహజం..క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీలో మరి ఏం జరుగుతోంది.. అధికార మత్తు తలకెక్కితే ఏ పార్టీ అయినా అంతే.. పదవీ వ్యామోహం ముందు అన్ని విలువలు కొట్టుకుపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
………………………………………………………..