
ACP prashanth Reddy Speaking with Media at kamalapur
– డ్రగ్స్ వాడి కుటుంబాలను ఆగం చేసుకోవద్దు.
– గుర్తు తెలియని వ్యక్తుల మెసేజెస్, ఫోన్ కాల్స్ కి స్పందించకండి
– చైన్ సిస్టమ్ బిజినెస్ ఊబిలో పడకండి
కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి.
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మండలంలో ఎక్కడైనా మత్తు పదార్థాల జాడ తెలిసిన, అనుమానాస్పదంగా అనిపించిన పోలీసువారికి వెంటనే సమాచారం అందించాలని కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి అన్నారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో తహసిల్దార్, ఎంపిడిఓ, సి.ఐ, ఎస్.ఐ. లతో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. . డ్రగ్స్ సేవనం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నష్టం జరుగుతుందని, యువత ఆత్మవిశ్వాసంతో ఉండి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసిపి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లో ఉద్యోగం, అధిక లాభాల పెట్టుబడులు ఇస్తున్నామంటూ మోసపూరిత మాటలను నమ్మొద్దని, స్పందించవద్దని ఆయన ప్రజలకు సూచించారు.ఆన్లైన్ గేమ్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.ఆర్థిక నేరాలు ఎక్కువ అవుతున్నాయని చైన్ సిస్టమ్ బిజినెస్ ఊబిలో పడిపోవద్దని కోరారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేయకూడదని,మార్ఫింగ్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నట్టే, రానున్న రోజుల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
———————–