
* పాల్గొన్న తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆకేరున్యూస్, వరంగల్: ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం వరంగల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి.దయాకర్ రావు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉనికిచెర్ల, ప్రాంతంల్లోని సభా వేదిక స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించి బహిరంగ సభకు అవసరమైన మార్పులు, సూచనలను చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు.
……………………….