– రైతులను మోసం చేసే ఫర్టిలైజర్ షాపులపై ఉక్కు పాదం
– కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సీడ్స్, ఫెర్టిలైజర్ షాపులను శుక్రవారం పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ,మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ సంయుక్తంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీడ్స్, ఫెర్టిలైజర్ షాపులలో స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్, తదితర రికార్డ్స్ తనిఖీ చేశారు.షాప్ లలో సీడ్స్, ఫర్టిలైజర్ పరిశీలించి నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందుల పై ఆరా తీశారు.రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని,ఏ షాపులో కొన్న తప్పకుండా బిల్ తీసుకోవాలని, సూచించారు. ఈ సందర్భంగా సీ ఐ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ…నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఎవరైనా అమ్మిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచార అందించాలని అన్నారు. తనిఖీల్లో భాగంగా సీడ్స్, ఫెర్టిలైజర్ షాపులకు సంబంధిత కంపెనీ ఇచ్చే ప్రిన్సిపుల్ సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు.షాప్ యజమానులు కాలం చెల్లిన ఎరువులు, విత్తనాలు, నాసిరకం పురుగుమందులను అమ్మినట్లయితే చట్టరీత్య చర్యలు తీసుకొనబడుతుందని,పీడీ యాక్ట్ కేసులు నమోదవుతాయని అన్నారు.నిబంధన మేరకే విక్రయాలు నిర్వహించాలి అన్నారు.

………………………………………..
