* మినిస్టర్ క్వార్టర్స్ లో పంపిణీ చేసిన మంత్రి పొన్నం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : మహిళా సంఘాలకు ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వడ్డీలేఇన రుణాలను విడుదల చేసింది. రూ. 304 కోట్ల రుణాలను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పంపిణీ చేశారు. హుస్నాబాద్ లోని 7 మండలాల్లోని 5329 స్వయం సహాయక సంఘాలకు రూ. 5 కోట్ల 66 లక్షల 16 వేల రూపాయల వడ్డీ రుణాలు
చెక్కులు అందించారు. హుస్నాబాద్ మండలానికి సంబంధించి 445 మహిళా సంఘాలకు 46 లక్షల రూపాయలు.. అక్కన్నపేట మండలానికి సంబంధించి 754 మహిళా సంఘాలకు 85 లక్షల రూపాయలు.. కోహెడ మండలానికి సంబంధించి 964 మహిళా సంఘాలకు కోటి 18 లక్షల రూపాయలు.. చిగురు మామిడి మండలానికి సంబంధించి 821 మహిళా సంఘాలకు 86 లక్షల రూపాయలు.. సైదాపూర్ మండలానికి సంబంధించి 703 మహిళా సంఘాలకు 86 లక్షల రూపాయలు..ఎల్కతుర్తి మండలానికి సంబంధించి 775 మహిళా సంఘాలకు 74,42,00 రూపాయలు..భీమదేవరపల్లి మండలానికి సంబంధించి 867 మహిళా సంఘాలకు 85 లక్షల 16 వేల రూపాయల చెక్కులు అందించారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
……………………………………………………………
