ఆకేరు న్యూస్, ములుగు: ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను మంగళవారం జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ ఎస్ , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి లు ములుగు నియోజకవర్గంలో 3642 స్వయం సహాయక సంఘాలకు 2 కోట 26 లక్షల 76 వేల రూపాయలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర మంత్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఈ అభివృద్ధిలో అందరూ స్వచ్చందంగా భాగస్వామ్యం కావాలని కోరారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో త్వరలో ములుగు కేంద్రంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మహిళలందరికీ సొంత ఆడబిడ్డలుగా భావిస్తున్నారని, మహిళల కష్టాలను అర్థం చేసుకొని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కట్చితంగా చేసి తీరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సంపత్ రావు, మహిళ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………….
