*ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల
– పరీక్షలు రాయనున్న 9.9 లక్షల మంది విద్యార్థులు
– విద్యార్థుల ఫోన్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింక్ పంపనున్న ఇంటర్మీడియట్ బోర్డు
– పరీక్షా కేంద్రాల గుర్తింపునకు QR కోడ్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను గురువారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. ఈ సంవత్సరం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు చదువుకునే కళాశాలలోని హాల్ టికెట్ల పంపిణీ ఉండనున్నట్టు తెలిపింది. హాల్ టికెట్ లో విద్యార్థుల వివరాలకు సంబంధించి తప్పులు సరి చేసుకోవడానికి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డుకు తీసుకొచ్చి సరి చేసుకోవాలని టిజిబిఐఈ సూచించింది.
పరీక్షా కేంద్రాల గుర్తింపునకు QR కోడ్
విద్యార్థులు వారి పరీక్షా కేంద్రాన్ని తెలుసుకునేందుకు వీలుగా హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. విద్యార్థులు వారి మొబైల్ ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు బోర్డు వద్ద నమోదు చేసుకున్న మొబైల్ నంబర్లకు నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్‌ను పంపనున్నట్లు టిజిబిఐఈ తెలిపింది.
